కలం, వెబ్ డెస్క్ : జార్ఖండ్ లోని ధన్‌బాద్ (Dhanbad) జిల్లా ఈసీఎల్ వారి ముగ్మా ప్రాంతంలోని చాపపూర్ ఓసీపీ సమీపంలో హఠాత్తుగా భూమి కుంగిపోయింది. భారీ పేలుడు లాంటి శబ్దం తర్వాత అకస్మాత్తుగా భూమి కుంగి, దాదాపు 100 మీటర్ల రహదారి 10-12 అడుగుల మేర చీలిపోయింది. దీంతో సమీప గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ కుంగుబాటు కారణంగా సుమారు 30 గ్రామాలకు ప్రధాన రహదారి అనుసంధానం పూర్తిగా తెగిపోయింది.
ఓసీపీ వద్ద భారీ పేలుళ్లు, అక్రమ మైనింగ్ కార్యకలాపాలే ఈ ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో తమ పరిస్థితి ఏంటి అని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని, అయితే అధికారులు ఎలాంటి పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Read Also: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే ప్రతి 3 నెలలకు రూ.100 ఫైన్!
Follow Us On: Instagram

