తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అఘాయిత్యం!

కలం, వెబ్‌ డెస్క్‌ : తిరుపతి (Tirupati) లక్ష్మీపురంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. వేసవి సెలవులకు పిన్ని ఇంటికి వచ్చిన ఒక మైనర్ బాలికపై ఆమె బాబాయ్ వరుసయ్యే వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. హైదరాబాద్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఈ బాలిక సెలవుల కోసం తిరుపతికి వచ్చింది. ఆ సమయంలో బాలిక వద్ద ఉన్న న్యూడ్ ఫొటోలను చూపిస్తానని బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు.

బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి ఆమెను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే బాధితురాలి తల్లి హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును తిరుపతి (Tirupati) ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ ఘటనపై తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు పోక్సో చట్టం కింద క్రైమ్ నెంబర్ 236/2026 తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా ఏపీ: శంకుస్థాపన చేసిన రక్షణ మంత్రి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>