Mobile Popup Ad
Mobile Popup Ad

‘లవ్ యూ కళ్యాణ్’.. చిరంజీవి స్పెషల్ పోస్ట్!

కలం, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా బాబీ దర్శకత్వంలో రాబోతున్న మూవీ ప్రారంభోత్సవం ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)​ కూడా హాజరై చిరంజీవిపై క్లాప్ కొట్టి షూటింగ్‌ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ వేడుకను ఉద్దేశిస్తూ చిరంజీవి తన సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. ‘ఈ రోజు కళ్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే, 30 సంవత్సరాల కిందట ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి“ మూవీకి. ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో టైమ్ తీసుకుని వచ్చి, నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులను ఆనందపరిచినందుకు థ్యాంక్యూ, లవ్ యూ కళ్యాణ్’​ అని పేర్కొన్నారు.

మాస్​ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా..

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)–బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అన్నాదమ్ముల ఎమోషన్స్ నేపథ్యంలో ఆ చిత్రం అలరించింది. ఇప్పుడు రాబోతున్న ఈ భారీ ప్రాజెక్టులో మెగాస్టార్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందట. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. తమన్ మ్యూజిక్ డైరెక్టర్.

Read Also: మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన విజ‌యల‌క్ష్మి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>