రామక్రిష్ణకాలనీలో ఘనంగా మత్స్యకారుల దినోత్సవం

క‌లం, క‌రీంన‌గ‌ర్‌: మత్స్యకారుల దినోత్సవం (Fishermen Day) సందర్బంగా శనివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలోని రామక్రిష్ణకాలనీ గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మత్స్యశాఖ సహకార సంఘ గ్రామ చైర్మన్ బోళ్ల శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.చేపల వేట వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఐకమత్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలని పేర్కొన్నారు. వృత్తిపై ఆదారపడి జీవించే కుటుంబాలకు ప్రభుత్వాలు ఆర్థిక చేయూతనందించే విదంగా సహకరించాలని కోరారు.వైస్ చైర్మన్ రేగుల శ్రీనివాస్, సెక్రెటరీ దాసరి తిరుపతి, డైరెక్టర్ లు, ముదిరాజ్ సంఘాల నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>