కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళా వారోత్సవాలను (Women Week Celebrations) ఈ నెల 25 నుంచి 31 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించనుంది. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, సంస్థలు, యువతులు, బాలికలు, దివ్యాంగులు, వృద్దులు తో సహా అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యులను చేస్తూ వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రజా పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళా సంఘాలను కీలక శక్తిగా తీర్చిదిద్దే దిశగా వారోత్సవాల నిర్వహణ ఉంటుంది. ఇందుకు సంబంధించి రోజువారీ కార్యక్రమాలు ఇలా ఉంటాయి.
మే 25 – సౌర విద్యుత్ ప్లాంట్లు & ప్రత్యేక సర్వసభ్య సమావేశాలు
* వికారాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కె.అసిఫాబాద్ ప్రాంతాల్లో 0.5 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ల ప్రారంభం
* మహిళా సంఘాలచే నడిచే 450 RTC బస్సుల ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం
* జిల్లా స్థాయిలో పోషకాహార అవగాహన కార్యక్రమాలు
* SHGలు, గ్రామ సంఘాల ప్రత్యేక సర్వసభ్య సమావేశాలు
* మహిళా సంఘాలకు బ్యాకింగ్ లోన్లు, వడ్డి లేని రుణాలు విడుదల, ఉత్తమ సంఘాల సత్కారం
* 2026-27 కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన
మే 26 – సామాజిక సమీకరణ దినం
* అర్హులైన మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, బాలికల గుర్తింపు
* మిగిలిన మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చడం
* దివ్యాంగులు, వృద్ధ మహిళల SHGల ఏర్పాటు
* టీన్ ఏజ్ బాలికలతో మాక్ పార్లమెంట్ నిర్వహణ
మే 28 – మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమాలు
* మహిళా సంఘ భవనాలు, వర్క్ షెడ్లు, మహిళా గోదాముల నిర్మాణాలకు శంకుస్థాపనలు
* భూమి పూజలు, పనుల ప్రారంభోత్సవాలు
మే 29 – రుణమేళాలు & జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్
* హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇంక్యుబేటర్ ప్రోగ్రాం ప్రారంభం
* మండల స్థాయిలో రుణమేళాలు
* మండల సమాఖ్యల ప్రత్యేక సర్వసభ్య సమావేశాలు
* కోళ్ల పెంపకం యూనిట్లు-500, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటు
* బ్యాంక్ లింకేజ్ ద్వారా ఆర్థిక సహాయం
* కమ్యూనిటీ ఎంటర్‌ప్రైజ్ ఫండ్ మద్దతు
* ఆయిల్ బండ్లు, నెక్ ఎగ్ కార్ట్స్ పంపిణీ
* దివ్యాంగులకు బ్యాటరీ వాహనాల పంపిణీ
* వ్యవసాయ ప్రాసెసింగ్ యూనిట్లు, షేడ్ నెట్లు, 185 గోదాముల నిర్మాణాలకు భూమి పూజ
* తేనెటీగల పెంపకం యూనిట్లు, బయో ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్ల గ్రౌండింగ్
మే 30&31 – మహిళల భద్రత & మౌలిక వసతుల ప్రారంభోత్సవాలు
* జిల్లా మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం
* గుర్తించిన ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల భూమిపూజలు
* జిల్లా సమాఖ్యల ప్రత్యేక సర్వసభ్య సమావేశాలు
* టీన్ ఏజ్ బాలికలకు సైకిళ్ల పంపిణీ
* అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా చదువు నేర్చుకున్న మహిళలకు సత్కారం
* ఆరోగ్య శిబిరాలు, మహిళలకు ఆరోగ్య పరీక్షలు
* మహిళల భద్రత కోసం ప్రత్యేక వింగ్ కార్యక్రమాలు
* పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ

