Mobile Popup Ad
Mobile Popup Ad

మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన విజ‌యల‌క్ష్మి

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్‌గా జీహెచ్ఎంసీ మాజీ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి (Gadwal Vijayalaxmi) నేడు అధికారికంగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం జీవో నెంబ‌ర్ 637 ద్వారా ఆమె నియామ‌క ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. ఈ అత్యున్న‌త ప‌ద‌విలో ఆమె ఐదేళ్ల పాటు కొన‌సాగుతూ రాష్ట్రంలోని మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌, సాధికార‌త‌, వారి హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ కోసం విధులు నిర్వ‌ర్తించ‌నున్నారు.

గ‌తంలో జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా (GHMC Mayor) సేవ‌లందించిన విస్తృత ప‌రిపాల‌నా అనుభ‌వం ఉన్న విజ‌యల‌క్ష్మి (Gadwal Vijayalaxmi) మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంపై ప‌లువురు రాజ‌కీయ‌, సామాజిక ప్ర‌ముఖులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి , వారికి మ‌రింత భ‌ద్ర‌త క‌ల్పించ‌డానికి త‌న శాయ‌శ‌క్తులా కృషి చేస్తాన‌ని గ‌ద్వాల విజ‌య ల‌క్ష్మి స్ప‌ష్టం చేశారు. ఈ ప‌ద‌వీ స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే గీతారెడ్డి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Read Also: 119 నియోజక వర్గాలకు ఇంచార్జీలను ప్రకటించిన కేసీఆర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>