రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర నూతన పాలకవర్గం ఏర్పాటు

కలం, యాదగిరిగుట్ట: తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గ సంఘాల ఐక్యతకు మరో కీలక అడుగు పడింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న రెడ్డి సంఘాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో రెడ్డి ఐక్య వేదిక (Reddy Ikya Vedika) రాష్ట్ర స్థాయి నూతన పాలకవర్గాన్ని ప్రకటించింది. రెడ్డి సంఘాల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రెడ్డి సంఘాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

కొత్త సారథ్యం.. కీలక బాధ్యతలు!

రాష్ట్ర అధ్యక్షుడిగా పటోళ్ల నాగిరెడ్డి (హైదరాబాద్), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సంధి తిరుపతిరెడ్డి (కరీంనగర్) బాధ్యతలు చేపట్టనున్నారు. సహాధ్యక్షులుగా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, బండ గోపాల్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులుగా విరాటి దేవేందర్ రెడ్డి, కొలిమి రాజ్ కుమార్ రెడ్డి, పూర్మని లింగారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఉపాధ్యక్షులుగా నేరుళ్ల భూమి రెడ్డి, రామన్నగారి బాగారెడ్డి, పాండురంగారెడ్డి, దొంగల బాపు రెడ్డి, పోసానిపల్లి మైపాల్ రెడ్డి, ఏనుగు వెంకట్ రెడ్డి నియమితులయ్యారు.

చందిరి కొండల్ రెడ్డికి రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఏలేటి రామ్ రెడ్డికి సహాయ కార్యదర్శిగా, ఏలేటి భూమి రెడ్డికి రాష్ట్ర కార్యదర్శిగా, గుర్రం పాపిరెడ్డికి కోశాధికారిగా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ముఖ్య సలహాదారులుగా మనోహర్ రెడ్డి, మిన్కురి రామ్ రెడ్డి, సీహెచ్ సదాకర్ రెడ్డి, కందడి ప్రవీణ్ రెడ్డిని నియమించారు. కందడి ప్రవీణ్ రెడ్డికి రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>