డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణం ప్రజా ఉద్యమంగా మారాలి: ఎమ్మెల్యే ఏలేటి

కలం, నిర్మల్ : డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్’ ( Nasha Mukt Bharat)  కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నక్సలిజం, ఉగ్రవాదం, మావోయిజం వంటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ దేశ భద్రతను బలోపేతం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణానికి చేపట్టిన సంకల్పం అభినందనీయమన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు వందమంది ఉక్కు మనుషులు దేశ గతిని మార్చగలరని, వజ్రంలాంటి సంకల్పం, ఉక్కులాంటి మనోబలం కలిగిన యువతే దేశానికి నిజమైన సంపద అని పేర్కొన్నారు. నార్కో టెర్రరిజాన్ని అరికట్టడంతో పాటు డ్రగ్స్ మాఫియా బారి నుంచి యువతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా సమాజానికి తీవ్ర ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యతగా భావించకుండా తల్లిదండ్రులు, విద్యావంతులు, యువత, స్వచ్ఛంద సంస్థలు సహా సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>