టాప్ ర్యాంక్ కొట్టిన డాట‌ర్‌.. మెగాస్టార్‌ను క‌లిపించిన‌ పేరెంట్స్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ ఎప్‌సెట్ (TG EAPCET) రిజ‌ల్ట్స్‌లో స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్ సాధించిన ఉప్ప‌ల్‌కు చెందిన విద్యార్థిని రుషిని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్ర‌త్యేకంగా అభినందించారు. రుషి మెగాస్టార్‌కు వీరాభిమాని కావ‌డంతో ఎంట్ర‌న్స్ ఎగ్జామ్‌లో మంచి ర్యాంక్ సాధిస్తే చిరంజీవికి ద‌గ్గ‌రికి తీసుకెళ్తామ‌ని ఆమె త‌ల్లిదండ్రులు చెప్పారు. ఇక త‌న ఫేవ‌రెట్ హీరోను క‌ల‌వాల‌న్న కోరిక‌తో రుషి క‌ష్ట‌ప‌డి చ‌దివి ఏకంగా ఫ‌స్ట్ ర్యాంక్ కొట్టేసింది. ఇక రుషి పేరెంట్స్ ఇచ్చిన మాట ప్ర‌కారం ఆమెను మెగాస్టార్ చిరంజీవి ద‌గ్గ‌రికి తీసుకెళ్లారు.

రుషి సాధించిన అద్భుత ప్ర‌తిభ‌ను తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆమెను త‌న నివాసంలో స‌న్మానించి ప్ర‌త్యేకంగా అభినందించారు. రుషిని ఆశీర్వ‌దించి, ఆమెకు ఒక ల్యాప్‌టాప్‌ను బ‌హుమ‌తిగా అందించారు. రాష్ట్ర స్థాయిలో ఫ‌స్ట్ ర్యాంక్ సాధించ‌డం, త‌న అభిమాన హీరో చేతుల‌మీదుగా ప్ర‌శంస‌లు, బ‌హుమ‌తి అందుకోవ‌డం ప‌ట్ల రుషి, ఆమె త‌ల్లిదండ్రులు సంతోషం వ్య‌క్తం చేశారు. ఇక‌ రుషి ఫ‌స్ట్ ర్యాంక్‌తో మ‌రో రికార్డును సైతం త‌న ఖాతాలో వేసుకుంది. 1986 తర్వాత ఇంజినీరింగ్ ఎంట్రెన్స్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి అమ్మాయిగా రుషి రికార్డు సృష్టించింది. దీంతో ఆమెకు రాష్ట్ర వ్యాప్తంగా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>