కరీంనగర్‌లో బీజేవైఎం ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత

కలం, కరీంనగర్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆందోళన చేపట్టింది. తెలంగాణ చౌక్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. “ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికి వస్తున్నారు. జాబ్ అప్లికేషన్ నింపడం రాదు” అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.

వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి..

బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంగ నరేష్ మాట్లాడుతూ… ఇంజినీరింగ్ డిగ్రీలు క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని పూర్తిగా ఖండించారు. సీఎం వ్యాఖ్యలు లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థులను కించపరిచేలా ఉన్నాయన్నారు. చదువుకున్న యువత ప్రతిభను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని, వెంటనే సీఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా నాయకులు నక్క ప్రమోద్, గుర్రం వెంకటేష్ గౌడ్, చిక్కుల కిరణ్, గడ్డం అరుణ్ , చుక్కల శ్రీకాంత్ యాదవ్, దయ్యాల రాజు, కొత్తకొండ వెంకటసాయి, ఆకుల మనోహర్, దర్శనాల మణిదీప్, బద్దం రాహుల్ రెడ్డి, బామండ్ల రాజు, ఆవుల తిరుపతి, గణేష్, గాజుల రాజ్ కుమార్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>