కలం, వెబ్ డెస్క్: ఎండలతో సతమవుతున్న చైనా.. అధునాతన టెక్నాలజీతో ఆశ్చర్య పరిచే విధంగా ‘రూఫ్‌టాప్ మిస్ట్ కూలింగ్ (Rooftop Mist Cooling)’ వ్యవస్థను తీసుకొచ్చింది. చైనాలోని బహుళ అంతస్తుల భవనాలు వేడిమి నుంచి తట్టుకునేందుకు ‘రూఫ్‌టాప్ మిస్ట్ కూలింగ్’ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ఇవి నిమిషాల వ్యవధిలోనే ఉష్ణోగ్రతను 5 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు తగ్గిస్తాయి. బహుళ అంతస్తుల భవనాలపై భాగంగా ఈ రూఫ్‌టాప్ మిస్ట్ కూలింగ్ ను ఏర్పాటు చేస్తారు.
వర్షం వచ్చిన విధంగానే సన్నని పైప్ లతో అధునాతన టెక్నాలజీతో చుట్టుపక్కల వాతావరణాన్ని అవి చల్లబారుతాయి. దీంతో ఉక్కపోతతో అల్లాడుతున్న అక్కడి ప్రజలు.. కొద్ది నిమిషాల్లోనే వాతావరణం చల్లబడి ఉపశమనాన్ని పొందుతారు. చైనాలోని షాన్‌సీ (Shanxi) ప్రావిన్స్‌లోని ఓ భవన సముదాయం “రూఫ్‌టాప్ రైన్” వ్యవస్థతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సకల హంగులతో ఆశ్చర్యపరిచే రీతిలో రూప్ టాప్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

