Mobile Popup Ad
Mobile Popup Ad

దేవుడిని రాజకీయాలకు దూరంగా పెట్టండి : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

కలం, డెస్క్ : కూటమి ప్రభుత్వం చివరకు దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకుంటోందని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy) విమర్శించారు. దేవుడిని రాజకీయాలకు వాడుకుంటే అంతకు మించిన మహాపాపం ఇంకొకటి ఉండదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని విషయాలను రాజకీయాల కోసమే వాడుకుంటోంది. అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేసింది కూటమి. రాజకీయాల కోసం వ్యవస్థలను వాడుకోవడం కూటమికి వెన్నతో పెట్టిన విద్య. కనీసం దేవుడిని అయినా రాజకీయాలకు దూరంగా పెట్టండి. గతంలో ఎన్నడూ మేం ఇలా వ్యవస్థలను, దేవుళ్లను రాజకీయాల కోసం వాడుకోలేదు. ఏపీలో సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా తిరుమల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు. సిట్ ఇచ్చిన నివేదికను కాదని.. సొంతంగా విచారణ కమిటీ వేయడం ఏంటని మండిపడ్డారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>