తప్పని గ్యాస్ తిప్పలు.. వినియోగదారుల్లో పెరుగుతున్న అసహనం

కలం, వలిగొండ : ఇరాన్ -అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ వినియోగదారులకు గత పది రోజుల నుండి తిప్పలు తప్పడం లేదు. వలిగొండ (Valigonda) మండలంలోని సుమేధ ఇండియన్ గ్యాస్ వినియోగదారులు గ్యాస్ కోసం బుకింగ్ చేయగా చాలామందికి గ్యాస్ బుకింగ్ కాకపోవడం, మరికొందరికి బుకింగ్ అయినప్పటికీ వారం రోజులుగా మెసేజ్ రావడం లేదు. మరికొందరికి అయితే గ్యాస్ తమకు డెలివరీ కాకుండానే డెలివరీ అయినట్లు మెసేజ్ వస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

దీంతో గ్యాస్ ఏజెన్సీ వద్ద బుకింగ్ కోసం కొందరు, వారం రోజులుగా ఓటీపీ రావడం లేదని కొందరు, డెలివరీ కాకుండానే డెలివరీ అయిందని మెసేజ్ వచ్చిందని మరికొందరు ఆందోళన నిర్వహించారు. అయితే గ్యాస్ ఏజెన్సీ వారు వినియోగదారుల పట్ల నిర్లక్ష్యమైన సమాధానాలు ఇస్తుండడంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, బ్లాక్ మార్కెట్లో మాత్రం గ్యాస్ సిలిండర్లు 1800 నుండి 2000 రూపాయల వరకు యథేచ్ఛగా లభిస్తుండడంతో గ్యాస్ వినియోగదారులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మండలం (Valigonda) లోని వినియోగదారులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>