Mobile Popup Ad
Mobile Popup Ad

డ్రగ్స్ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదు : రామచందర్ రావు

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) జిల్లా బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(Ramchander Rao) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సిట్ వల్ల ఎలాంటి ఫలితం రాదని, “సిట్ అంటే కూర్చోవడమే” అంటూ ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగినట్లే, డ్రగ్స్ కేసులోనూ నిజాలు బయటకు రావని అన్నారు. డ్రగ్స్ నిర్మూలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పిన మాటలు అమలు కాలేదని విమర్శించారు. ఫామ్‌హౌస్‌కు డ్రగ్స్ ఎలా వచ్చాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నాయకులే డ్రగ్స్ పార్టీల్లో పాల్గొనడం బాధాకరమని, స్కూల్ పిల్లల వరకు డ్రగ్స్ వ్యాపారం విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్ఎస్ఎస్‌(RSS) పై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, భారత నిఘా సంస్థ ‘రా’ను కూడా కాంగ్రెస్ నిషేధించాలని కోరిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో లిక్కర్, డ్రగ్స్, భూదందాలు అన్నీ కాంగ్రెస్ నేతల ఆధీనంలోనే నడుస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు అధికంగా ఉన్నాయని, పంటలు ఎండిపోతున్నాయని, పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

మందుల సామేల్ (Mandula Samuel) బ్రాహ్మణ సమాజాన్నే కాదు.. హిందువులపైనా విషం కక్కారని తెలిపారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆగడాలు పెరిగిపోయాయని, బీజేపీ (BJP) కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులు కూడా కాంగ్రెస్ నేతల ప్రభావంలో పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని హననం చేస్తున్నారని ఆరోపిస్తూ, బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>