‘బాహుబలి : ది ఎటర్నల్ వార్’కు అంతర్జాతీయ గుర్తింపు

కలం, సినిమా : ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ (Baahubali The Eternal War) ప్రాజెక్ట్‌కు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక యానిమేషన్ వేదికలలో ఒకటైన ఫ్రాన్స్‌లో జరిగే అన్నేసీ అంతర్జాతీయ యానిమేషన్ ఫెస్టివల్‌లోని  ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ విభాగానికి ఈ ప్రాజెక్ట్ ఎంపికైంది. నిర్మాణ దశలో ఉన్న ప్రపంచ స్థాయి యానిమేషన్ ప్రాజెక్టులకు మాత్రమే ఈ విభాగంలో అవకాశం కల్పిస్తారు. ఈ ఎంపికతో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ పరిశ్రమలో ముందస్తు గుర్తింపు, విశ్వసనీయత లభించినట్లయింది.

గతంలో ఈ వేదికలో ప్రదర్శితమైన అనేక ప్రాజెక్టులు తర్వాతి కాలంలో భారీ విజయాలు నమోదు చేయడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ నేపథ్యంలో “బాహుబలి: ది ఎటర్నల్ వార్” (Baahubali The Eternal War) ఎంపిక కావడం భారతీయ యానిమేషన్ పరిశ్రమకు ఒక కీలక మైలురాయిగా భావించవచ్చు. ముఖ్యంగా తెలుగు కథా నేపథ్యంతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్, గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉందని ఈ ఎంపిక ద్వారా స్పష్టమవుతోంది.

Read Also: కోతిని తరుమబోయి సజీవ దహనం.. షాకింగ్ వీడియో

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>