కలం, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) ఈ నెల 18, 19 ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీలపై చంద్రబాబు నాయుడు పర్యటన సాగబోతోంది. 18న సాయంత్రం విజయవాడ నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు. 18న రాత్రి పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన అత్యవసర సహాయాలు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ నిధులు, అమరావతికి రావాల్సిన నిధులు, ఇతర మౌళిక సదుపాయాల పనుల కోసం ఆయన కేంద్రమంత్రులను కలవబోతున్నారు.
Read Also: ఏడాది పొడవునా విమాన టికెట్ రేట్లు నియంత్రించలేం: రామ్మోహన్ నాయుడు
Follow Us On: Instagram


