కలం, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రేపు కోల్‌కతాకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్ ( West Bengal) సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. తన పర్యటనలో భాగంగా ఉదయం 7:40 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు పయనమవుతారు. 9:20 గంటలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌కు వెళ్తారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అక్కడ జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1:45 గంటలకు కోల్‌కతా నుంచి తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 3:45 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకుంటారు.

