కలం, వెబ్ డెస్క్ : మందడం రోడ్డు అలైన్ మెంట్ కార్యక్రమంలో నిన్న రాములు అనే వృద్ధుడు గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. రోడ్డు కోసం తాము ల్యాండ్ ఇచ్చి నష్టపోయామని మంత్రి నారాయణకు తన గోడు వెల్లబోస్తూ సడెన్ గా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ కు తరలించేలోపు ప్రాణాలు కోల్పోవడం సంచలనం రేపింది. దీంతో బాధితుడి కుటుంబాన్ని నేడు మంత్రి నారాయణ (Minister Narayana), ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు (Chandrababu) రామారావు కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు.
రామారావు (Ramarao) కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రామారావు కుటుంబీకులు ధైర్యంగా ఉండాలన్నారు చంద్రబాబు (Chandrababu). అయితే అంతకు ముందు మంత్రి నారాయణపై రామారావు కుటుంబీకులు ఆగ్రహం తెలిపారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు.
Read Also: తిరగబడుతున్న టీడీపీ కార్యకర్తలు.. తప్పు చేశామంటూ ఆవేదన
Follow Us On: Pinterest


