Mobile Popup Ad
Mobile Popup Ad

జిల్లాలో పెట్రోల్ కొరత లేదు : నెల్లూరు కలెక్టర్

కలం, వెబ్‌డెస్క్: నెల్లూరు (Nellore) జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కలెక్టర్ హిమాన్షు శుక్లా (Collector Himanshu Shukla) స్పష్టం చేశారు. సోమవారం కొడవలూరు మండలంలోని రామన్నపాలెంలో పెట్రోల్ బంక్‌ను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, కేవలం అపోహలు నమ్మి వినియోగదారులు ఒక్కసారిగా బంకులకు రావడం వలన తాత్కాలికంగా సమస్య తలెత్తిందని అన్నారు. మరికొన్ని గంటల్లో జిల్లాకు అన్ని ఆయిల్ కంపెనీల ట్యాంకర్లు చేరుకుంటాయని తెలిపారు. జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>