కలం, డెస్క్ : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యిపై (Tirumala Ghee Case) అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు (Chandrababu) సంచలన కామెంట్లు చేశారు. వైసీపీ హయాంలో ప్రమాదకరమైన కెమికల్స్ తో నెయ్యి తయారు చేశారన్నారు. అలాంటి ప్రమాదకరమైన కెమికల్స్ ను 20 కోట్ల లడ్డూల్లో కలిపేసి తయారు చేశారని.. వాటిని భక్తులతో తినిపించారని సీఎం చంద్రబాబు చెప్పారు. అవి తిన్న వారికి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెప్పారని.. అంతటి ఘోరం చేసిన తర్వాత కూడా వైసీపీ బాధ్యత తీసుకోవట్లేదని చంద్రబాబు విమర్శించారు.
‘సీఎంగా పనిచేసిన జగన్ బాధ్యతగా వ్యవహరించట్లేదు. కల్తీ జరిగిందని సిట్ నివేదిక ఇచ్చినా దాన్ని ఒప్పుకోవట్లేదు. పైగా మమ్మల్నే క్షమాపణ చెప్పమంటున్నారు. తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బ తీయాలని చూస్తే ఆ దేవుడు క్షమించడు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదు. అదే విషయం జగన్ కూడా గుర్తుంచుకోవాలి. ఈ కేసులో నిందితుల లిస్టును తయారు చేసేందుకు ఏకసభ్య కమిటీ వేస్తే.. వైసీపీ వాళ్లు గగ్గోలు పెడుతున్నారు. ఏ తప్పు చేయకపోతే వాళ్లకు భయం ఎందుకు’ అంటూ ప్రశ్నించారు సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu).
Read Also: అంబులెన్స్ రాలేదు.. ఎడ్లబండిపై భార్యను తీసుకెళ్లిన భర్త..
Follow Us On: Youtube

