కలం, తెలంగాణ బ్యూరో : Telangana Maoists | మావోయిస్టు పార్టీలో తెలంగాణ ప్రాంతానికి చెందినవారిలో ఇక మిగిలింది 11 మందేనని డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) తెలిపారు. ఇందులో ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు, ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఇద్దరు జిల్లా కమిటీ సభ్యులు, నలుగురు ఏరియా కమిటీ సభ్యులు ఉన్నట్లు వివరించారు. ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు మాత్రమే తెలంగాణ ప్రాంతంలో అజ్ఞాతంలో ఉన్నారని, మిగిలినవారంతా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో మొత్తం కేంద్ర కమిటీలోనే ప్రస్తుతం ముగ్గురు ఉన్నారని, ఇందులో ఇద్దరు తెలంగాణకు చెందినవారన్నారు. తెలంగాణకు చెందిన కేంద్రకమిటీ సభ్యుల్లో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, పసునూరి నరహరి అలియాస్ సంతోష్ ఉన్నారు. రాష్ట్రకమిటీ సభ్యుడు ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ ఉన్నారు.
తెలంగాణ మావోయిస్టులు (Telangana Maoists) పార్టీలో 2023 నాటికి రాష్ట్రానికి చెందినవారు మొత్తం 124 మంది ఉంటే ఇప్పుడు కేవలం 11 మందికి తగ్గిపోయి ఆ పార్టీ ప్రభావం కనీస స్థాయికి చేరుకున్నట్లు వివరించారు. రెండేండ్ల వ్యవధిలోనే సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 15 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 25 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 63 మంది ఏరియా కమిటీ సభ్యులు, 437 మంది పార్టీ సభ్యుల చొప్పున మొత్తం 591 మంది లొంగిపోయారని, వారితో పాటు 142 ఆయుధాలు ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలిపారు.
Read Also: అంబులెన్స్ రాలేదు.. ఎడ్లబండిపై భార్యను తీసుకెళ్లిన భర్త..
Follow Us On: Youtube

