Mobile Popup Ad
Mobile Popup Ad

కీసర ఆలయంలో చైన్​ స్నాచింగ్​..

కలం, వెబ్​ డెస్క్​ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కీసరగుట్ట (Keesaragutta) శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకున్న దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న ఒక మహిళ మెడలోని 5 తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>