epaper
Wednesday, February 18, 2026
epaper

సిద్ధ రామ‌య్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన డీకే శివ‌కుమార్‌

క‌లం, వెబ్ డెస్క్‌: క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వెయ్యి రోజుల ప‌రిపాల‌న‌ పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా హావేరిలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (DK Shivakumar) ఈ కార్యక్రమంలో సీఎం సిద్ధ రామ‌య్య‌ (Siddaramaiah) విగ్రహాన్ని ఆవిష్కరించ‌డం చ‌ర్చ‌కు తెర‌లేపింది. ఈ స‌భ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చాయి. సుమారు 1.5 ల‌క్ష‌ల మందికి స‌భ‌లో భోజ‌న ఏర్పాట్లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్రంలోని 9 జిల్లాలకు చెందిన‌ లక్ష కుటుంబాలకు భూ హక్కు పత్రాలు అంద‌జేశారు. స‌భా వేదికలో సీఎం సిద్ద రామయ్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్ర‌హాన్ని గోటగోడి రాక్ గార్డెన్ నేత దాసనూర్ అందజేశారు. డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ విగ్రహాన్ని ఆవిష్క‌రించి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం ప‌ద‌వి నేప‌థ్యంలో సిద్ధ రామ‌య్య‌, డీకేకు మ‌ధ్య విబేధాలుంటాయ‌ని అంతా భావిస్తుంటారు. కానీ, వాట‌న్నింటిని ప‌క్క‌న పెట్టి డీకే హావేరి స‌భ‌లో సీఎం విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>