హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ శాఖ అండ.. ఎస్పీ కీలక హామీ

కలం, ఖమ్మం బ్యూరో: శాంతిభద్రతల పరిరక్షణలో విధులు నిర్వహిస్తూ, స్పెషల్ బ్రాంచ్ విభాగంలో సేవలందించిన హెడ్ కానిస్టేబుల్ హరి గోపాల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి జిల్లా పోలీస్ యంత్రాంగం అండగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు (SP Rohit Raj) బుధవారం తన కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు రూ.1 లక్ష ఆర్థిక సాయం (Financial Support) చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో రాత్రింబవళ్లు విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన లేదా అనారోగ్యంతో మృతి చెందిన పోలీస్ సిబ్బంది కుటుంబాలను పోలీస్ శాఖ ఎప్పటికీ విస్మరించదని, కష్టకాలంలో వారికి అండగా ఉంటుందని తెలిపారు. మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు, ఇతర బెనిఫిట్స్ త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులను ఎస్పీ ఆదేశించారు. కుటుంబ సభ్యులకు అండగా నిలిచిన పోలీస్ శాఖకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>