ప్రతి అంశంపైనా దర్యాప్తు చేయలేరు.. ఈడీకి హైకోర్టు స్పష్టీకరణ

కలం, వెబ్ డెస్క్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారాల పరిధిపై కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. తన దృష్టికి వచ్చిన ప్రతి అంశంపై దర్యాప్తు చేపట్టే అధికారం ఈడీకి లేదని స్పష్టం చేసింది. మనీలాండరింగ్ కేసుల విచారణలోనూ చట్టం నిర్దేశించిన నిబంధనలు, పరిమితులను తప్పనిసరిగా పాటించాలని తేల్చిచెప్పింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) పరిధిలోకి రాని నేరాలపై ఆ చట్టం కింద విచారణ చేపట్టడం కుదరదని పేర్కొంది.

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేవై నంజగౌడతో పాటు ఆయనకు సంబంధం ఉన్న పలువురు వ్యక్తులపై ఈడీ చేపట్టిన దర్యాప్తును హైకోర్టు రద్దు చేసింది. జస్టిస్ ఎంఐ అరుణ్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. అంతేకాకుండా ఆస్తుల జప్తును సమర్థిస్తూ పీఎంఎల్‌ఏ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను కూడా కొట్టివేశారు. పిటిషనర్లలో ఒకరి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను తిరిగి అప్పగించాలని ఆదేశించారు.

కోలార్, చిక్కబళ్లాపుర జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్‌ (కోముల్‌)లో ఉద్యోగ నియామకాల సందర్భంగా అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఈడీ విచారణ ప్రారంభించింది. ఈ చర్యలను సవాల్ చేస్తూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఉద్యోగ నియామకాల అక్రమాలపై ఎఫ్‌ఐఆర్ లేదా అధికారిక క్రిమినల్ కేసు నమోదైనప్పుడే, చట్టబద్ధమైన పరిధిలో ఈడీ దర్యాప్తు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని కోర్టు (Karnataka High Court) పేర్కొంది. కేవలం ఆరోపణలను ఆధారంగా చేసుకుని మనీలాండరింగ్ అంశాన్ని సుమోటోగా పరిగణించి విచారణ ప్రారంభించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఈ తీర్పు ఈడీ దర్యాప్తు అధికారాల పరిధిపై మరోసారి చర్చకు దారితీసింది.

Also Read : IAF రికార్డ్.. 13 వేల అడుగుల ఎత్తులో ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>