Mobile Popup Ad
Mobile Popup Ad

డీలిమిటేషన్ : హీటెక్కిస్తోన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

కలం, తెలంగాణ బ్యూరో: లోక్‌‌సభ స్థానాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. డ్రాఫ్ట్ బిల్లును ఎంపీలకు పంపింది. ప్రస్తుతమున్న 543 సీట్లను 850కి పెంచనున్నట్లు పేర్కొంది. 2011 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ (Delimitation) జరగనున్నట్లు తెలుస్తున్నది. ఇలా జరిగితే తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్నాటక వంటి దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

జనాభా ప్రాతిపదికన పెంచితే ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి నాలుగైదు రాష్ట్రాల ఎంపీ సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా తమిళనాడు సీఎం స్టాలిన్ వంటి కీలక నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైబ్రిడ్ విధానాన్ని అనుసరించాలంటూ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రతిపాదించారు. డీలిమిటేషన్ విధానాన్ని సౌత్ తప్పుపడుతున్న తరుణంలోనే కేంద్రం ఏకంగా డ్రాఫ్ట్ కాపీని ఎంపీలకు పంపడం.. ఈ నెల 16 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దాన్ని ప్రవేశపెట్టనుండటం మరింత హీట్ పుట్టిస్తున్నది.

మహిళా రిజర్వేషన్ల (Women Reservation Bill) అంశం కూడా తాజా డ్రాఫ్ట్‌‌లో స్పష్టంగా ఉంది. రొటేషన్ పద్ధతిలో ఈ కోటాను అమలు చేయనున్నారు. మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించేలా మహిళా రిజర్వేషన్ల బిల్లును అదనపు సవరణతో కేంద్రం పార్లమెంట్‌‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. డీలిమిటేషన్ (Delimitation), ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ప్రధానంగా తాజా పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఎంపీలకు కేంద్రం పంపిన డ్రాఫ్ట్‌‌లో ఏముంది? డీలిమిటేషన్‌‌పై పార్లమెంట్‌‌లో ఏ నిర్ణయం తీసుకోనున్నారు? ప్రతిపక్షాలు ఎలా స్పందించనున్నాయి? వంటి అంశాలపై ‘కలం‘ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికి నష్టం: రేవంత్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>