ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్రం బిగ్ షాక్‌..!

క‌లం, వెబ్ డెస్క్‌: సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)కు భార‌త ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసింది. ఇన్‌స్టాలో చిన్నారుల‌పై లైంగిక వేధింపుల‌కు సంబంధించిన కంటెంట్‌ను ఎలా అనుమ‌తిస్తున్నార‌ని కేంద్ర ఐటీ శాఖ‌ ప్ర‌శ్నించింది. అస‌లు దీన్ని ఎలా అనుమ‌తించార‌ని నిల‌దీసింది. ఇన్‌స్టా వేదిక‌గా ప్ర‌మోట్ చేసే యాడ్స్‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని నోటీసులో పేర్కొంది.

చిన్నారుల‌పై లైంగిక వేధింపుల కంటెంట్‌ను నిరోధించేందుకు మెటా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో తెలపాలని కోరింది. కొద్ది రోజులుగా ఇన్‌స్టాగ్రామ్ చిన్నారుల‌ను లైంగికంగా వేధించే కంటెంట్‌ను ప్రోత్స‌హిస్తోందంటూ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. దీంతో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశాల మేర‌కు శుక్రవారం అధికారులు మెటాకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై మెటా ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి.

Read Also: ధ్యానం చేస్తే అనుబంధాలు నిజంగా బలపడతాయా?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>