కలం, కరీంనగర్ బ్యూరో : కొత్తకొండ వీరభద్రస్వామి (Kothakonda Veera Badhra Swamy) ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) హామీ ఇచ్చారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు.
ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విదేశీ సంస్కృతికి అలవాటుపడి మన సంస్కృతికి మర్చిపోతున్న ఈ తరుణంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి పోటీలు నిర్వహిస్తూ తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను గుర్తు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. అందరం కలిసి నరేంద్రమోడీ సంకల్పంతో భారత్ ను విశ్వగురుగా తీర్చిదిద్దేందుకు వికసిత్ భారత్ పేరిట శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారని తెలిపారు.
Read Also: జిల్లా, మండలాల మార్పుకు బ్రేక్ !
Follow Us On : WhatsApp


