బీఎస్-6 వాహనదారులకు భారీ శుభవార్త

కలం, వెబ్ డెస్క్: బీఎస్-6 వాహనాలు (BS6 Vehicles)  వాడుతున్నవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక నుంచి మూడేళ్లకోసారి మాత్రమే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్స్ (PUC) రెన్యువల్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఉన్న ప్రతి సంవత్సరం నిబంధనను రద్దు చేస్తున్నపట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే సమయంలో కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. బీఎస్-6 ప్రైవేట్ వాహన వయస్సు ఆరేళ్ల లోపు ఉంటే మూడు సంవత్సరాలకోసారి, 6–10 ఏళ్లుంటే సంవత్సరానికోసారి, కొని పదేళ్లు దాటి ప్రతి ఆరు నెలలకోసారి పొల్యూషన్ సర్టిఫికేషన్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎలా లెక్కిస్తారంటే..

పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్స్ (PUC) రెన్యువల్ చేసుకునే విషయంలో వాహనం మొదటిసారి రిజిస్ట్రేషన్ అయిన తేదీని పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తారు. ఇప్పటికే PUC తీసుకున్నవారికి అది రెన్యువల్ చేసుకునే సమయంలో కొత్త గడువు వర్తిస్తుంది. ఒకవేళ గడువు ముగియడానికి పది రోజుల ముందే రెన్యువల్ చేసుకుంటే.. పాత డేట్ ముగిసిన వెంటనే కొత్త సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుంటుంది. తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు కేవలం కాలుష్య నియంత్రణకు సంబంధించినవే తప్ప.. వాహనాల (BS6 Vehicles) ఇంజిన్ లేదా తయారీ ప్రమాణాలకు ఉద్దేశించినవి కావనే విషయాన్ని గమనించాలని వాహనదారులను కేంద్రం కోరింది.

Also Read : అంబానీల‌ నుంచి పెళ్లి ప్ర‌పోజ‌ల్ వ‌చ్చింది: అన‌న్యా బిర్లా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>