ఆర్జీయూకేటీలో రెండో రోజు కొనసాగిన కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన

కలం, బాసర: బాసర ఆర్జీయూకేటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు (Contract Teachers) తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ‘మార్చ్ టు రెగ్యులరైజేషన్’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు గురువారం నిరసన చేపట్టారు. ఏబీ -3 నుంచి విశ్వవిద్యాలయ ప్రధాన గేటు వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. గత 18 ఏళ్లుగా విశ్వవిద్యాలయంలో విద్యాబోధనతో పాటు పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత, తగిన వేతన ప్రయోజనాలు కల్పించాలని కోరారు.

తమ సేవలను గుర్తించి వెంటనే రెగ్యులరైజేషన్ లేదా అబ్జార్ప్షన్ ప్రక్రియ చేపట్టాలని, యూజీసీ 7వ వేతన సవరణ ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పావని, డాక్టర్ రమాదేవి, డాక్టర్ సాయి కృష్ణ, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ ఉపేందర్ రావు, డాక్టర్ శ్రీకాంత్, సతీష్ కుమార్, భానుప్రియ, డాక్టర్ కాశన్న, డాక్టర్ రాములు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>