సెంట్రింగ్ కార్మికుడి మృతిపై ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెంట్రింగ్ పని చేస్తూ గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు. ఫిర్యాదుదారురాలి వివరాల ప్రకారం..ఆమె భర్త సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కుటుంబంలో ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుమారు 39 సంవత్సరాల వయస్సు గల మృతుడు గత పది రోజుల అనారోగ్యం కారణం గా మద్యానికి బానిసై సెంట్రింగ్ పనికి వెళ్ళక పోవడంతో అతని కుటుంబ సభ్యులు అనారోగ్యం కారణంగా క్యాలి తప్పి మాటలు మాట్లాడుతున్నాడని ఈనెల 19న కొండగట్టుకి అతడిని తీసుకొని వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చారు.

అతడికి రాత్రి ఫిట్స్ రావడంతో వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స పొందుతూ ఉండగా పరిస్థితి మరింత విషమించిందన్నారు. కుటుంబ సభ్యులు వైద్యుల సూచన మేరకు సూర్య నర్సింగ్ హోం హాస్పిటల్ కు తరలించి చికిత్స చేస్తుండగా 23న ఉదయం సుమారు 06:59 గంటలకు మృతుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతుడికి శరీరంపై గాయాలు ఉండటంతో, అవి ప్రమాదవశాత్తు సంభవించాయా? ఎవరైనా కొట్టడం లేదా అనారోగ్య కారణాల వల్ల సంభవించాయా? అనే విషయంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెలికితీసేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోలీస్ స్టేషన్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందిన వెంటనే ఎస్‌ఐ ఏ. లక్ష్మారెడ్డి స్పందించి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఫిర్యాదుదారురాలి నుంచి దరఖాస్తును స్వీకరించి, ఆ దరఖాస్తును పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి మృతికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు వైద్య నివేదికలు, పోస్టుమార్టం నివేదిక, ఘటనకు సంబంధించిన సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం మృతికి గల వాస్తవ కారణాలు వెల్లడవుతాయని కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>