పటాన్ చెరులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు (Patancheru) పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఓఆర్ఆర్ ముత్తంగి ఎగ్జిట్ – 3 వద్ద అక్రమంగా తరలిస్తున్న 55 టన్నుల రేషన్ బియ్యాన్ని పక్కా సమాచారంతో SOT పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన మకవానా(24), దాహ (21), కర్ణాటకకు చెందిన నాగేష్ (21)ను అరెస్ట్ చేశారు. రెండు లారీలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హైదరాబాద్ నుంచి గుజరాత్ రాష్ట్రానికి బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>