Mobile Popup Ad
Mobile Popup Ad

లక్నోలో అనధికార కాల్‌సెంటర్ గుట్టు రట్టు.. అమెరికన్లే టార్గెట్..

లక్నో(Lucknow) కేంద్రంగా నడుస్తున్న ఇల్లీగల్ కాల్‌సెంటర్‌పై సీబీఐ అధికారులు దాడులు చేశారు. అమెరికన్లు టార్గెట్‌గా ఈ కాల్‌ సెంటర్‌ను రన్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో పలువుని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌లో పరారీలో ఉన్న కీలక నిందితుడు వికాస్ కుమార్ ఉన్నాడు.

ఈ కేసును CBI సెప్టెంబర్ 24, 2024న నమోదు చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2024లో నిందితులతో సంబంధం ఉన్న పలు ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. ఆ సోదాల ద్వారా పూణే, హైదరాబాద్, విశాఖపట్టణంలలో నడుస్తున్న 4 అక్రమ కాల్ సెంటర్లను మూసివేసింది. పూణే, విశాఖపట్టణాల్లో VC ఇన్‌ఫ్రోమెట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ అక్రమ కాల్ సెంటర్లను నడుపుతున్నారు. వీటిని నడపడంలో కీలక పాత్ర పోషించిన వికాస్ కుమార్‌పై కేసు నమోదు అయినప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకోవడానికి పూణే చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్ట్ నుంచి సీబీఐ వారంట్ తీసుకుంది.

CBI అధికారులు 20 నవంబర్ 2025న అతన్ని లక్నో(Lucknow)లోని అతని నివాసం నుండి అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.14 లక్షల నగదు, మొబైల్‌ ఫోన్లు, నేరానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల సమయంలో, అతను లక్నోలో మరో అక్రమ కాల్ సెంటర్ నడుపుతున్నట్టు వెలుగులోకి వచ్చింది. దీంతో అక్కడ కూడా దాడులు చేశారు. ఆ కాల్ సెంటర్‌లో 52 లాప్‌టాప్‌లు, సైబర్ క్రైమ్ కార్యకలాపాలకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు.

Read Also: తొలి రోజు 17 కేసులు విచారించిన నూతన సీజేఐ

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>