కలం, వెబ్‌డెస్క్: నీట్ పరీక్ష పేపర్ లీక్ (NEET Paper Leak) వ్యవహారం రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతోంది. ఈ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మహారాష్ట్రకు చెందిన ప్రముఖ కోచింగ్ సంస్థ లాతూర్ ఆర్సీసీ క్లాసెస్ వ్యవస్థాపకుడు శివరాజ్ మొటెగంకర్‌ను సీబీఐ (CBI) రెస్ట్ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో 10 మంది అరెస్ట్ అయినట్లు సీబీఐ వెల్లడించింది. శివరాజ్ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, పది మంది విద్యార్థులతో అద్దె గదిలో ట్యూషన్లు చెప్పే స్థాయి నుంచి నేడు మహారాష్ట్రలో అతి పెద్ద నీట్ జేఈఈ కోచింగ్ నెట్‌వర్క్‌ను నిర్మించే స్థాయికి ఎదిగారు. మే 3న జరిగిన పరీక్షకు ముందే ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసి సర్క్యూలేట్ చేసిన నెట్‌వర్క్ మొత్తంలో శివరాజ్ ప్రధాన పాత్ర పోషించినట్లు సీబీఐ గుర్తించింది. శివరాజ్ ఫోన్‌లో నీట్ క్వశ్చన్ పేపర్ ఉన్నట్లు వెల్లడించింది. దీంతో సీబీఐ శివరాజ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.

