షాహిద్ కపూర్ ప్రవర్తనపై రష్మిక అసహనం.. వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ కాక్‌టెయిల్-2 సినిమా ప్రమోషన్స్ కోసం నిర్వహించిన ఓ ఈవెంట్‌లో నటుడు షాహిద్ కపూర్ ప్రవర్తనతో హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) అసౌకర్యానికి గురైంది. స్టేజ్‌పై చిత్రబృందంతో కలిసి ఫోటోలకు పోజులిస్తున్న సమయంలో షాహిద్ రష్మిక భుజంపై చేయి వేయడానికి ప్రయత్నించారు. అయితే ఆయన టచ్‌తో రష్మిక ఒక్కసారిగా కంగారుపడింది. తీవ్ర అసహనానికి లోనవుతూ వెంటనే పక్కకు తప్పుకుంది. ఊహించని ఘటనతో షాహిద్ కపూర్ కూడా ఆశ్చర్యపోయి తన చేతిని వెనక్కి తీసుకున్నాడు.

రష్మిక ఆ వెంటనే ముఖంపై నవ్వును ప్రదర్శించినప్పటికీ, ఆమె బాడీ లాంగ్వేజ్‌లో అసౌకర్యం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. షూటింగ్‌లలో ఎలా ఉన్నా నిజ జీవితంలో ఇలాంటి ప్రవర్తనను రష్మిక ఇష్టపడలేదని కామెంట్ చేస్తున్నారు. అక్కడ అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ఆమె అతిగా స్పందించిందంటూ షాహిద్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>