చనిపోయినా కనికరించని కులపెద్దలు.. పాడె మోసిన భార్య

కలం, డెస్క్ : రోజురోజుకూ మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. కుల బహిష్కరణల పేరుతో కొందరు పెద్దమనుషులు సాగిస్తున్న ఆగడాల వల్ల.. ఎంతో మంది సామాజిక వివక్షకు గురవుతున్నారు. చివరకు చనిపోయినా కూడా కనికరించకుండా కర్కశాన్ని బయటపెడుతున్నారు. తాజాగా జగిత్యాల (Jagtial) జిల్లా బీర్పూర్ మండలం, కందనకుంట గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి ఎదుల రాజేశం కుటుంబాన్ని గ్రామ పెద్దలు కుల బహిష్కరణ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎదుల రాజేశం మృతి చెందగా.. అతని పాడె మోయొద్దని గ్రామ పెద్దలు, సర్పంచ్ ఆదేశించినట్టు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

కాళ్లు మొక్కుతామని వేడుకున్నా కనికరించలేదని వాపోయారు. దీంతో చేసేది లేక రాజేశం భార్య, అక్కలు, సొంత కుటుంబీకులే పాడె మోశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మనిషి చనిపోయినా మీ పట్టింపులు వదలరా అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. సర్పంచ్, గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Read Also: బాబోయ్​.. భయపెట్టిన భారీ సింక్​ హోల్​!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>