కలం, వెబ్‌డెస్క్: ఒక్కసారి ఊహించుకోండి. మీరు నడుస్తున్న లేదా నిలబడి ఉన్న రోడ్డు హఠాత్తుగా లోపలికి కుంగిపోయి భారీ గుంత ఏర్పడితే మీ పరిస్థితి ఏంటి? ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా! అచ్చం ఇలాంటి అనుభవమే చైనాలోని షాంఘై లో జనానికి ఎదురైంది. ఓ పెద్ద రోడ్డు హఠాత్తుగా లోపలికి కుంగిపోయింది (Shanghai Sinkhole). దానిపై ఉన్న కంటైనర్ షాపులను, వస్తువులను, పార్క్ చేసిన వాహనాలను తనలోకి లాగేసుకుంది. ఈ సింక్ హోల్ ఏ స్థాయిలో ఏర్పడిదంటే దాని ధాటికి సమీపంలోని భవనాల గోడల్లో సైతం నెర్రెలు వచ్చాయి. అయితే, అదృష్టవశాత్తూ ఇందులో ప్రాణనష్టమేదీ జరగలేదు.
చైనా ఆర్థిక రాజధాని అయిన షాంఘై మృదువైన అల్యూవియల్ నేలపై ఉంది. ఇక్కడ తరచూ ఇలాంటి సింక్ హోల్ ఏర్పడుతుంటాయి. ప్రస్తుతం ఏర్పడిన సింక్ హోల్ (Shanghai Sinkhole) భారీ స్థాయిలో ఉంది. సుమారు 10 నుంచి 20 మీటర్ల వెడల్పుతో పెద్ద గుంత ఏర్పడింది. దీనికి కారణం నీటి లీకేజీగా అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్డు కింద ఉన్న పైప్‌లైన్‌లో ఈ నెల 11న లీకేజీ ఏర్పడినట్లు గుర్తించారు. అప్పటికే రోడ్డుపై కొన్ని చీలికలు వచ్చాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం హఠాత్తుగా రోడ్డు కిందకు కుంగిపోయింది. ఈ ఘటనలో ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మిన్హాంగ్ జిల్లా పరిధిలోకి వచ్చే షాంఘై లోని కిక్సిన్ రోడ్డులో జరిగిన ఈ సంఘటన సీసీ టీవీలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
చైనాలోని షాంఘైలో ఒక్కసారిగా కుంగిపోయిన రోడ్డు
కంటైనర్ షాపులు, వాహనాలను లాగేసుకున్న సింక్ హోల్
హడలెత్తిపోయిన పరిసర ప్రాంత వాసులు!A massive sinkhole suddenly opened in Shanghai, China swallowing a large section of roadway.#Shanghai #Sinkhole #China #ViralVideo #MinhangDistrict… pic.twitter.com/x7567zxlDS
— Kalam Daily (@kalamtelugu) February 12, 2026
Read Also: వాట్సాప్‌ను బ్లాక్ చేసిన రష్యా
Follow Us On: Instagram


