epaper
Wednesday, February 18, 2026
epaper

అంబటి రాంబాబుకు మరో షాక్ ..

కలం, వెబ్ డెస్క్​: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu)కు న్యాయస్థానంలో మరో షాక్​ తగిలింది. గతంలో నమోదైన సంక్రాంతి సంబురాల కేసులో ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు గుంటూరు సివిల్ కోర్టు తీర్పునిస్తూ, ఈ నెల 26వ తేదీ వరకు అంబటి రాంబాబుకు రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపింది.

2023వ సంవత్సరంలో సత్తెనపల్లి (Sattenapalle) నియోజకవర్గంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా లాటరీ టికెట్లను విక్రయించారని జనసేన పార్టీ నాయకులు అప్పట్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో తాజాగా పోలీసులు చర్యలు చేపట్టారు. సత్తెనపల్లి పోలీసులు అంబటి రాంబాబును అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది.

అంబటి రాంబాబు (Ambati Rambabu) ఇప్పటికే రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్ పొందారు. అయితే ఇప్పుడు మూడవ కేసులో రిమాండ్ విధించడంతో ఆయనకు ఇబ్బందులు తప్పడం లేదు. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు అంబటిని తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also: తిరుపతిలో జాతీయ ఆయుర్వేద వైద్య సంస్థ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>