కలం, వెబ్ డెస్క్ : జగిత్యాల జిల్లా ధర్మపురిలో (Dharmapuri) ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) పై కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ క్రమంలో ధర్మపురి పట్టణంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పెద్ద ఎత్తున కాన్వాయ్‌తో పర్యటించడమే కాకుండా, సైరన్లు వేయిస్తూ హల్చల్ చేయడం వివాదాస్పదమైంది. నిబంధనల అతిక్రమణపై సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
Read Also: రిటైర్డ్ ఉద్యోగుల చావుకు కారణం ప్రభుత్వమే : కేంద్రమంత్రి బండి సంజయ్
Follow Us On: Pinterest


