epaper
Wednesday, February 18, 2026
epaper

రిటైర్డ్​ ఉద్యోగుల చావుకు కారణం ప్రభుత్వమే : కేంద్రమంత్రి బండి సంజయ్

కలం, వెబ్​ డెస్క్​ : విశ్రాంత ఉద్యోగుల చావులకు రాష్ట్ర ప్రభుత్వం కారణం అని కేంద్రమంత్రి బండి సంజయ్​  (Bandi Sanjay) ఆరోపించారు. రిటైర్డ్​ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్​ పై సీఎం రేవంత్​ రెడ్డికి (Revanth Reddy) ఆయన లేఖ రాశారు. పదవి విమరణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ చెల్లించకుండా వేదనలకు గురి చేయడం న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. ​జీవిత మలి దశలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన విశ్రాంత ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం క్షమించరానిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 61 మంది రిటైర్డ్​ ఉద్యోగులు చనిపోయారని ఆరోపించారు.

రిటైర్డ్​ అయిన తరువాత ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్​ అన్నీ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ఉద్యోగులను ప్రాధాన్యత లేని క్యాటగిరిగా భావిస్తున్నారా, మీకు మానవత్వం ఉందా? అంటూ ధ్వజమెత్తారు. రిటైర్డ్​ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయీలు అన్నీ చెల్లించాలని డిమాండ్​ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని, కాంగ్రెస్​ ప్రభుత్వం దిగిరాకపోతే హైదరాబాద్ నడిబోడ్డున నిరసనలు తెలియజేస్తాం అని బండి సంజయ్ (Bandi Sanjay )​ హెచ్చరించారు.

Read Also: బాబ్రీ మసీదు పునర్నిర్మాణం అసాధ్యం : ఆదిత్యనాథ్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>