సొంత పార్టీ మహిళకు వేధింపులు.. జనసేన నేతపై కేసు!

క‌లం, వెబ్ డెస్క్‌: సొంత పార్టీలోని మ‌హిళ‌ను వేధింపులకు గురి చేశాడన్న ఆరోపణలతో జ‌న‌సేన (Janasena) నేతపై కేసు నమోదైంది. ప‌శ్చిమ‌ గోదావ‌రి(West Godavari) జిల్లాలోని వీర‌వాస‌రం జ‌డ్పీటీసీ జయప్రకాష్ నాయుడు త‌న‌ను వేధింపుల‌కు గురి చేస్తున్నాడంటూ మ‌ద్దాల విజ‌య‌ల‌క్ష్మి అనే మ‌హిళ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని మోసం చేశాడని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుందామ‌ని న‌మ్మ‌బ‌లికి, ముందు ఇల్లు క‌ట్టుకుందామ‌ని రూ.10 లక్షలు, బంగారం తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు పెళ్లి గురించి అడిగితే చిత్ర‌హింస‌ల‌కు గురి చేస్తున్నాడ‌ని వాపోయింది. దీంతో జయప్రకాష్ పై అట్రాసిటీ సెక్షన్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Read Also: ఫోన్లు వదలని పిల్లలు.. పేరెంట్స్​కు పరీక్ష

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>