కోహ్లీతో పోలిక.. జర్నలిస్టుపై బాబర్ ఆజం ఫైర్!

క‌లం, వెబ్ డెస్క్‌: పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో (PSL 2026) మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam)కు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చేదు అనుభవం ఎదురైంది. విరాట్ కోహ్లీ (Virat Kohli)తో తనను పోలుస్తూ ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు బాబర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏప్రిల్ 8న కరాచీలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ కింగ్స్‌మెన్‌పై పెషావర్ జల్మీ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 146 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి ఛేదించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో.. విరాట్ కోహ్లీలా మ్యాచ్‌లను ఫినిష్ చేసే సామర్థ్యం మీకు లేదని విమర్శకులు అంటున్నారని ఒక రిపోర్టర్ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నతో తీవ్ర అసహనానికి గురైన బాబర్ (Babar Azam).. ఇకనైనా ఈ పోలికలను ఆపాలని కోరారు. ఇటువంటి ఆలోచనలను తన దగ్గరే ఉంచుకోవాలని సదరు రిపోర్టర్‌కు హితవు పలికారు. తాను ఎన్నోసార్లు జట్టు కోసం మ్యాచ్‌లను ఫినిష్ చేశానని, ఇది కేవలం వారి అపోహ మాత్రమేనని బాబర్ స్పష్టం చేశారు. అయితే కింగ్స్‌మెన్, పెషావర్ జల్మీ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో బాబర్ ఆజం 43 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. కుశాల్ మెండిస్‌తో కలిసి రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేశారు. 15వ ఓవర్‌లో బాబర్ ఔట్ అయినప్పటికీ, చివర్లో ఇఫ్తికార్ అహ్మద్ అజేయంగా 15 పరుగులు చేసి జట్టును గెలిపించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో బాబర్ 82 పరుగులు సాధించారు.

Read Also: కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్.. కానీ ఆ 30 నిమిషాలే సమస్య!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>