కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ హల్దీరామ్ స్వీట్ హౌస్ (Haldiram Sweet House)పై పోలీసులు కేసు నమోదు చేశారు. కల్తీ, ఫంగస్ పట్టిన స్వీట్లను విక్రయిస్తున్నారంటూ కొందరు వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు విచారణ చేపట్టి యాజమాన్యంపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో హల్దీరామ్ స్వీట్ హౌస్ (Haldiram Sweet House)పై బిఎన్ఎస్ యాక్ట్ లోని 79, 274, 275, 115 (2), 131, 352 సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసును నమోదు చేశారు. నమూనాలను పరీక్షల నిమిత్తం FSLకు పంపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
Read Also: జాతిపిత అని కేసీఆర్ ఎన్నడూ చెప్పుకోలేదు : కేటీఆర్
Follow Us On: Sharechat


