కలం డెస్క్ : దసరా పండగ వేళ.. జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దసరా సెలవుల సందర్భంగా పలువురు యువకులు చెన్నై నుంచి మున్నార్ ట్రిప్‌కు బయలుదెరారు. రహదారిపై వెళ్తుండగా విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలో కారు అదుపుతప్పింది. ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్‌లోకి రాని కారు.. డివైడర్‌ను ఢీకొట్టింది. వెంటనే కారు లోనుంచి మంటలు చెలరేగాయి.
ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ప్రమాదానికి అతివేగమే కారణమై ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం అందిచినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు చెప్పారు.

