ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం

కలం, వెబ్ డెస్క్​ : కరీంనగర్ (Karimnagar) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్-పెద్దపల్లి బైపాస్ రోడ్డులోని బొమ్మకల్ ఫ్లైఓవర్ (Bommakal Flyover) వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వచ్చిన కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాద సమయంలో కారులో మొత్తం నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్‌లోనే మరణించగా, మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>