Mobile Popup Ad
Mobile Popup Ad

శ్రీశైలం వెళ్తుండగా ఘోర ప్రమాదం.. మంటల్లో దగ్ధమైన కారు

కలం, వెబ్‌డెస్క్: మార్కాపురం (Markapuram) జిల్లాలోని త్రిపురాంతకం మండలం రాజుపాలెం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ముందు వెళ్తున్న జేసీబీ వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది.

అదృష్టావశాత్తు కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే కారు దిగడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. విజయవాడకు చెందిన వీరు శ్రీశైలం దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>