‘స్పిరిట్’ సెట్‌లోకి ప్రభాస్.. ఫుల్ యాక్షన్!

కలం, వెబ్ డెస్క్: ప్రభాస్‌తో (Prabhas) సందీప్ రెడ్డి వంగా తీస్తున్న ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభం కాబోయే కొత్త షెడ్యూల్‌లో ప్రభాస్ అడుగు పెట్టబోతున్నాడట. మూడు డిఫరెంట్ పాత్రల్లో ప్రభాస్ నటించబోతున్నారట. దీనిలో పవర్ ఫుల్ పోలీస్ పాత్ర మాత్రం హైలైట్ గా ఉంటుందని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. సందీప్ మార్క్ యాక్షన్‌తో పాటు ప్రభాస్ రొమాంటిక్ సైడ్ కూడా ఎలివేట్ చేయబోతున్నారట. ‘రాజా సాబ్’ డిజాస్టర్ కావడంతో కొన్నాళ్లుగా షూటింగులకు దూరంగా ఉన్న ప్రభాస్.. విరామం తీసుకునేందుకు ఇటలీ వెళ్లిపోయాడు. ఇటీవలే హైదరాబాద్‌ తిరిగి వచ్చారని.. స్పిరిట్ మూవీకి డేట్స్ కేటాయించినట్లు టాక్.

‘స్పిరిట్’ తరువాత ఏంటీ..

‘స్పిరిట్’ మూవీ వచ్చే ఏడాది మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో మూడు నెలలు ప్రభాస్ స్పిరిట్ మూవీకి డేట్స్ కేటాయించే అవకాశం ఉంది. దీంతో, ప్రభాస్ పార్ట్ షూట్ పూర్తి కానుంది. తరువాత ఎవరితో మూవీ తీస్తారనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే, పలువురు దర్శకులు కథలు చెప్పినట్లు టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>