వీకెండ్‌లో ఎక్కువ నిద్రపోతున్నారా.. మీ బాడీ ప్రమాదంలో పడ్డట్టే!

కలం, వెబ్ డెస్క్: చాలామంది వారమంతా కోల్పోయిన నిద్రను వీకెండ్‌లో (Weekend Sleep) భర్తీ చేసుకోవచ్చని భావిస్తారు. అయితే శని, ఆదివారాల్లో 10 నుండి 12 గంటలు నిద్రపోవడం వల్ల కొంతవరకు అలసట తగ్గినప్పటికీ, దీర్ఘకాలిక నిద్రలేమి శరీరంపై దుష్ప్రభావాలను పూర్తిగా తొలగించలేదని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్ర అనేది అవసరమైనప్పుడు నింపుకునే నిల్వ లాంటిది కాదు. అది ప్రతిరోజూ శరీరానికి కావలసిన కనీస అవసరం. నిద్ర తక్కువైనప్పుడు ఏకాగ్రత లోపించడం, మతిమరుపు, చిరాకు లాంటి సమస్యలు మొదలవుతాయి. కాలక్రమేణా ఆరోగ్య సమస్యలుగా మారతాయి. ప్రస్తుతం భారతదేశంలో మారుతున్న పని వేళలు, స్క్రీన్ టైమ్ పెరగడం లాంటి కారణాల వల్ల ప్రతి ముగ్గురిలో ఒకరు తీవ్రమైన నిద్రలేమితో బాధపడుతున్నారు.

నిద్ర అనేది మన జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, హార్మోన్లను నియంత్రించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి అవసరం. అయితే, వారాంతాల్లో ఆలస్యంగా పడుకుని, ఉదయం ఆలస్యంగా లేవడం వల్ల జీవ గడియారం దెబ్బతింటుంది. దీనినే ‘సోషల్ జెట్ లాగ్’ అంటారు. అందుకే ప్రతిరోజూ 7 నుండి 8 గంటల నిరంతర నిద్ర అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీర్ఘకాలికంగా నిద్ర తక్కువైతే అది అధిక రక్తపోటు, ఊబకాయం, టైప్-2 మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. నిద్రలేమి వల్ల మెదడు పనితీరు మందగించి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతోంది. మెరుగైన నిద్ర కోసం ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రలేవడం. గంట ముందే మొబైల్/టీవీ స్క్రీన్లకు దూరంగా ఉండటం, సాయంత్రం వేళల్లో కాఫీ, సిగరెట్, మద్యం వంటి వాటిని నివారించాలి. పడకగదిని ప్రశాంతంగా ఉంచుకోవాలని నిపుణులు చెప్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>