మహాముదురు పాము.. చనిపోయినట్లు యాక్టింగ్.!​ వీడియో వైరల్​

కలం, వెబ్​ డెస్క్​ : పాము అనగానే విషంతో పాటు భయం మాత్రమే మనకు ముందుగా గుర్తుకు వస్తాయి. అయితే, కొన్ని పాము జాతులు శతృవు నుంచి తప్పించుకోవడానికి విషప్రయోగమే కాకుండా నటిస్తాయి కూడా. దీనికి రుజువు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్న వీడియో. ఓ పామును పట్టుకున్న వ్యక్తి నుంచి తప్పించుకునేందుకు చనిపోయినట్లు నటించింది (Snake Acting). ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది. ఈ వీడియోలో హోంగు అనే జాతి పామును ఓ వ్యక్తి పట్టుకుంటాడు.

అయితే, ఆ పాము చనిపోయినట్లు నటిస్తూ నోరు తెరిచి, కళ్లు మూసుకుని ఉంటుంది. కాసేపటికే లేచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంది. మళ్లీ ఆ వ్యక్తి పట్టుకునేందుకు ప్రయత్నించగా చనిపోయినట్లు నటించడం వీడియోలో కనిపిస్తుంది. పాము నటనను చూసిన నెటిజన్లు వాహ్​ కమల్ హాసన్​ యాక్టింగ్​ అంటూ కామెంట్స్​ పెడుతున్నారు. కాగా, హోంగు జాతి పాములు తమను తాము రక్షించుకునేందుకు ఇలా నటిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>