కలం, కరీంనగర్ బ్యూరో: పెట్రోల్ రేట్ల పెంపు నిరసిస్తూ.. జగిత్యాల (Jagtial)జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. కొద్దిసేపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా, ఓ బస్సు డ్రైవర్ మాట్లాడుతూ.. పెట్రోల్ రేట్ల గురించి తరువాత మాట్లాడుదాం, ముందు వడ్లు, మక్కల సంగతి చూడండి. కొనుగోలు చేయక ఇబ్బంది అవుతుంది అని పేర్కొన్నాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కాంగ్రెస్ నేతలకు ఆర్టీసీ డ్రైవర్ ఝలక్..?
-పెట్రోల్ రేట్ల పెంపుకు నిరసనగా జగిత్యాలలో కాంగ్రెస్ నేతలు ఆందోళన
– అయితే అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్.. పెట్రోల్ రేట్ల గురించి తర్వాత కానీ వడ్లు, మక్కలు గురించి పట్టించుకోండి అని మాట్లాడటం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందిRTC… pic.twitter.com/DDSHGKk15S
— Kalam Daily (@kalamtelugu) May 25, 2026
Read Also: ప్రేమను నిరాకరించిందని యువతి ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి
Read Also: సర్కార్ ఆస్పత్రులు అస్తవ్యస్తం

